ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

KMR: ఎల్లారెడ్డి మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్​ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్​ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. కళాశాలలో విజయ ఫర్టిలైజర్స్​ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన జాబ్​మేళా ఉందని ప్రిన్సిపాల్​ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు శివకుమార్ (9346708846)ను సంప్రదించాలన్నారు.