టికెట్ లేని ప్రయాణికులకు భారీ జరిమానా

టికెట్ లేని ప్రయాణికులకు భారీ జరిమానా

VSP: సింహాచలం రైల్వే స్టేషన్‌లో గురువారం వేకువజాము నుంచి సాయంత్రం వరకు అంబూజ్ పేరుతో రైల్వే వాణిజ్య సిబ్బంది, RPF రక్షక దళంతో రైలు ప్రయాణికులను ముమ్మర తనిఖీలు నిర్వహించారు. స్టేషను నలువైపులా రైలు దిగిన ప్రతి ప్రయాణికుడుని క్షుణ్ణంగా తనిఖీలు చేసి, టికెట్ లేని ప్రయాణికులను గుర్తించి రూ.1,47,000 జరిమానా విధించినట్లు చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.