పుంగనూరులో బ్యాంక్ ఉద్యోగుల నిరసన

CTR: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం పుంగనూరు పట్టణంలోని చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఉద్యోగులు, సిబ్బంది తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ బ్యాంకు ఎదుట నిరసన తెలిపారు. ఉద్యోగులను కట్టు బానిసలుగా మార్చే కార్మిక కోడ్లను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.