కర్నూలులో ‘ఆకలి కేక’

కర్నూలులో ‘ఆకలి కేక’

KRNL: కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటల్ కార్మికుల ఉపాధి సంక్షోభంలో పడిందని పేర్కొంటూ హోటల్, బేకరీ వంట మాస్టర్స్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు పురుషోత్తం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.