ఓటర్లను ఆకర్షించే విధంగా ప్రచార సామాగ్రి..!
మెదక్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రచార సామాగ్రి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రామాయంపేట మండలంలో ప్రింటింగ్ షాపుల్లో ప్రచార సామాగ్రి విక్రయాలు నిర్వహిస్తున్నారు. 2వ విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్తగా షాపులు వెలిశాయి. మొదటి విడత గుర్తులు కేటాయించడంతో వివిధ ప్రాంతాల అభ్యర్థులు సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు.