BRS, కాంగ్రెస్ దొందూ దొందే: BJP రాష్ట్ర అధ్యక్షుడు

JN: BRS, కాంగ్రెస్ పార్టీలు దొందు, దొందేనని BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. JNలో గురువారం జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం కుంభకోణంలో BRS నేతలు ఉండటంతో వారికి అండగా ఉంటూ ఆ కేసులను CBIకి అప్పగించట్లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు 420 మోసాలకు పాల్పడుతుందని విమర్శించారు.