గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల మందు పంపిణీ!

గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల మందు పంపిణీ!

GDWL: పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఇటిక్యాల, రాజశ్రీ గార్లపాడు గ్రామాల్లో మంగళవారం గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని సర్పంచ్ జీవంధర్ రెడ్డి ప్రారంభించగా జిల్లా అధికారి డాక్టర్ జి.శివానంద స్వామి పర్యవేక్షించారు. నట్టల నివారణతో జీవాలు ఆరోగ్యంగా ఉండి, రైతులకు ఆర్థిక లాభాలు కలుగుతాయని స్వామి తెలిపారు.