గిట్టుబాటు ధ‌ర ఇవ్వ‌డం లేద‌ని రైతుల ఆగ్రహం

గిట్టుబాటు ధ‌ర ఇవ్వ‌డం లేద‌ని రైతుల ఆగ్రహం

నల్గొండ జిల్లా శెట్టిపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. స్థానికంగా ఉన్న పద్మశ్రీ రైస్ మిల్లువద్ద చేరుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు. పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లుదారులు కొర్రీలు పెడుతూ ధరలను తగ్గిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో కనీస మద్దతు ధర కూడా అందడం లేదని అన్నారు.