బాలానగర్‌లో శిశువు మృతదేహం లభ్యం

బాలానగర్‌లో శిశువు మృతదేహం లభ్యం

MBNR : బాలానగర్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. భవాని మాత ఆలయ సమీపంలోని మురుగు కాలువలో గురువారం అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం కవర్‌లో లభ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంచాయతీ సిబ్బంది సమాచారంతో ఎస్సై లెనిన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.