హమాస్‌కు ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికలు

హమాస్‌కు ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. హమాస్ తన దారికి రాకపోతే గాజాలో విధ్వంసం తప్పదని పేర్కొంది. అలాగే ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని లేకపోతే నరకదారులు తెరుచుకుంటాయని ఇజ్రాయెల్ రక్షణమంత్రి క్వాట్జ్ వ్యాఖ్యానించారు. వెంటనే తమ బందీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గాజా నాశనం చూడకతప్పదన్నారు.