'ప్రహరీ గోడ తక్షణమే నిర్మించాలి'

'ప్రహరీ గోడ తక్షణమే నిర్మించాలి'

కోనసీమ: మండపేట మండలం కేశవరంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ తక్షణమే నిర్మించాలని ఆ గ్రామానికి చెందిన వల్లూరి శ్రీ వాణీ కోరారు. ప్రహరీ గోడ నిర్మాణం కోసం ఆమె చేపట్టిన రిలే నిరాహారదీక్ష ఆదివారం 17వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలోని స్థానిక ప్రజా ప్రతినిధులు చేయాల్సిన పోరాటాన్ని తాను చేస్తున్నానని పేర్కొన్నారు.