చోరీకి పాల్పడిన దొంగ అరెస్ట్
ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో సెప్టెంబర్ 22న వందనపు లక్ష్మీ కుమారి ఇంట్లో జరిగిన రూ.42 లక్షల దోపిడీ కేసులో నలుగురిని అరెస్టు చేయగా, తాజాగా కావేటి చిన్నను అరెస్టు చేసినట్లు ఎస్పీ సుస్మిత రామనాథన్ గురువారం తెలిపారు. నిందితుడి నుంచి రూ.12 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.