'రాష్ట్ర విభజనపై సీఎం న్యాయ పోరాటం చేయాలి'
E.G: రాష్ట్ర విభజనలో ఏపీకి జరిగిన అన్యాయంపై ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో ఓటింగ్ పెట్టకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని.. దీనిపై తాను పుష్కరకాలంగా న్యాయపోరాటం చేస్తున్నానని తెలియజేశారు.