ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ఏర్పాట్లు: భట్టి
TG: ఫ్యూచర్ సిటీలో 'రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' ఈరోజు ప్రారంభం కానుంది. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ఏర్పాట్లు చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. పెట్టుబడులు ఆకర్షించడానికి సమ్మిట్ పెట్టలేదన్నారు. తమ విజన్ ఏంటో అందరికీ వివరిస్తామని చెప్పారు. ఒక్కో అంశంపై ఒక్కో ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. తెలంగాణ విజన్‌కు సహకరించాలని విపక్షాలను కోరారు.