'పంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులనే గెలిపించండి'

'పంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులనే గెలిపించండి'

NZB: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను పెద్దఎత్తున గెలిపించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంఘం కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కులాలకు, బంధుత్వాలకు అతీతంగా, ప్రలోభాలకు లొంగకుండా బీసీ అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు.