ఇళ్ల స్థలాల అర్జీలను పరిశీలించిన MRO

BPT: అద్దంకి మండలం వేలమూరిపాడుకి చెందిన పలువురు ప్రజలు తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు ఇచ్చిన నేపథ్యంలో బుధవారం MRO శ్రీ చరణ్ వారి గ్రామానికి వెళ్లి పరిశీలించారు. వారి నివాస ప్రాంతాలను పర్యవేక్షించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు.