ఇంటర్వ్యూ బోర్డును ఏర్పాటు చేస్తాం: భట్టి

ఇంటర్వ్యూ బోర్డును ఏర్పాటు చేస్తాం: భట్టి

TG: సివిల్స్‌ అభ్యర్థులు ఇంటర్వ్యూలను సమర్థంగా ఎదుర్కొనేలా ప్రభుత్వంలోని సీనియర్‌ బ్యూరోక్రాట్లతో ఇంటర్వ్యూ బోర్డును ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం పథకాన్ని మరింత తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. UPSC ఇంటర్వ్యూలకు ఎంపికైన 50 మందికి నిన్న భట్టి విక్రమార్క రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు.