గ్రౌండ్‌లో గణిత పాఠాలు.. మంత్రి లోకేష్ ప్రశంసలు

గ్రౌండ్‌లో గణిత పాఠాలు.. మంత్రి లోకేష్ ప్రశంసలు

AP: విద్యార్థులకు గణతంపై భయం పోగొట్టేందుకు ఓ టీచర్ చేస్తున్న కృషిని మంత్రి లోకేష్ అభినందించారు. 'కోటకందుకూరులో ఏపీ మోడల్ స్కూల్ టీజీటీ మ్యాథ్స్ టీచర్ వెంకటచంద్ర Good work, keep it up. గ్రౌండులోనూ గణితం చెబుతున్న మీ ప్రతిభకు హృదయపూర్వక అభినందనలు. కోలాటం, కర్రసాము నేర్పుతూనే వివిధ పరీక్షలకు సిద్ధం చేస్తున్న మీ కృషి స్ఫూర్తిమంతం' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.