'పుంగనూరులో డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సులు'

CTR: పుంగనూరు శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సు ప్రారంభానికి ప్రభుత్వ అనుమతి లభించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. BA, B.Com, B.Sc హానర్స్ కోర్సులు కూడా అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఆధునిక విద్యా అవసరాలకు అనుగుణంగా కోర్సులు ప్రారంభించామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.