జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

SDPT: నియోజకవర్గంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం హెల్త్ ఇన్సూరెన్స్, బీమా పత్రాలను అందజేశారు. హరీశ్ రావు చొరవతో 191 మంది జర్నలిస్టులకు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరుల పాల్గొన్నారు.