పాకాల వాగు ఉగ్రరూపం.. నిలిచిన రాకపోకలు

పాకాల వాగు ఉగ్రరూపం.. నిలిచిన రాకపోకలు

MHBD: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గూడూరు మండలం కేంద్రాల్లోని పాకాల వాగు ఆదివారం ఉదయం బ్రిడ్జి పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు ఉధృతి కారణంగా గూడూరు నుంచి కేసముద్రం, గూడూరు నుంచి నెక్కొండ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రెవెన్యూ అధికారులు పాకాల వాగు ఉధృతిని పరిశీలించారు. చేపల వేటకు చెరువులోకి వెళ్లవద్దని ప్రజలకు సూచించారు.