రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేత

రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేత

KRNL: నగరంలో ఈనెల 23, 24 తేదీల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ సోమవారం తెలిపారు. కర్నూలు రూరల్ మండల మునగాలపాడు సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ నుంచి అశోక్ నగర్ ఫిల్టర్ బెడ్‌కు 1,200 ఎంఎం డయా పైపులైన్ లీక్ కారణంగా నీటి సరఫరా నిలిచిపోతుందని కమిషనర్ విశ్వనాథ్ పేర్కొన్నారు.