ఆదోనిలో ఉచిత కంటి వైద్య శిబిరం
KRNL: ఆదోని పట్టణ బీరప్ప కాలనీలో బీజేపీ పట్టణ సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షులు మరియానీ చెన్నబసప్ప ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 185మందికి కంటి పరీక్షలు నిర్వహించి 36మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లకు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విట్టా రమేష్ పాల్గొన్నారు.