'గౌడ కులస్తులు ఐక్యంగా ఉండి పోరాడాలి'
సూర్యాపేట: గౌడ కులస్తులు ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ రామ్మూర్తి గౌడ్, ప్రధాన కార్యదర్శి చిత్తలూరి యాదగిరి గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో గౌడ సంఘటన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గౌడ్ సంక్షేమ కోసం ప్రభుత్వం పెద్దపీట వేయ్యాలని వారు డిమాండ్ చేశారు.