14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

మంచిర్యాల: లక్షెట్టిపేట తాలూకాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఉదయం ఐదు గంటలకు అన్ని మండలాల్లో 12 నుంచి 14° మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికి భయపడుతున్నారు. రెండు మూడు రోజులుగా చలి తీవ్రత పెరిగి శీతల గాలులు వీస్తున్నాయి.