ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ముఖ్య లక్ష్యం: ఎమ్మెల్యే

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ముఖ్య లక్ష్యం: ఎమ్మెల్యే

MBNR: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆదివారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్వాడ మండలం మాధవరంలో సుమారు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రంథాలయం, సీసీ రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్, ప్రైమరీ హెల్త్ సెంటర్, హైమాస్ట్ దీపాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని అన్నారు.