యాగంటి ఉమామహేశ్వరుడికి ప్రత్యేక పూజలు

యాగంటి ఉమామహేశ్వరుడికి ప్రత్యేక పూజలు

NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో చైత్రమాస వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈవో పాండురంగా రెడ్డి ఆధ్వర్యంలో స్వామికి రుద్రాభిషేకం, పుష్పలంకరణతో కుంకుమార్చన బిల్వర్చన నిర్వహించారు. విశేష నందవరం చౌడేశ్వరి మాత భక్తులకు శోభాయమానంగా దర్శనమిచ్చారు. ఆలయంలో మహామంగళహారతి ఘనంగా నిర్వహించగా, భారీగా తరలి వచ్చిన భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు.