రేపు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం
ELR: జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 31, నవంబర్ 1 తేదీల్లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్షులు దాసరి శేషు కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో జరిగే ఈ శిబిరంలో హైదరాబాద్ ఆస్పత్రికి చెందిన వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.