పేద విద్యార్థికి మాజీ ఎమ్మెల్యే సాయం

VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేద విద్యార్థి పందిరి ఆశిష్‌కు కాలేజీ ఫీజు కోసం రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు. విద్యాదానం అన్ని దానాలలో ప్రధానమైనదని అన్నారు. కూటమి ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. సోమవారం ఆశీల్‌మెట్ట కార్యాలయంలో విద్యార్థికి నగదు సాయం అందజేశారు.