అయ్యప్ప గుడి ఫ్లైఓవర్‌ మూసివేత..!

అయ్యప్ప గుడి ఫ్లైఓవర్‌ మూసివేత..!

నెల్లూరు పరిధిలో తూర్పు, పడమర ప్రాంతాలను అనుసంధానం చేసే అయ్యప్ప గుడి ఫ్లై ఓవర్‌ను శుక్రవారం అర్ధరాత్రి నుంచి మూసివేస్తున్నట్లు కమిషనర్ వై.ఓ నందన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 10వ తేదీ వరకు ఫ్లైఓవర్‌కు మరమ్మతులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. బ్రిడ్జి పూర్తిస్థాయిలో దెబ్బతిని వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడిందన్నారు. వాహనదారులు గమనించాలని ఆయన కోరారు.