'వర్షాకాల నేపథ్యంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలి'

'వర్షాకాల నేపథ్యంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలి'

NRML: వర్షాకాల నేపథ్యంలో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సయ్యద్ ముజాహిద్ తెలిపారు. శుక్రవారం భైంసా మండలంలోని లింగా గ్రామంలోని రైతు వేదికలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది సలీమ్, దత్తురాం, ANM అంజనాబాయి పాల్గొన్నారు.