వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
SDPT: బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామంలో యాసంగి సీజన్–2026కు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ బైరా మనసా రాజేందర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో రైతుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. తేమ 17%లోపు ఉండేలా ధాన్యం తీసుకురావాలని సూచించారు.