ఉపాధి హామీ పనులను పరిశీలించిన పీడీ

తూ.గో: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ 60లక్షల పనిదినాలు కల్పించినట్లు డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి తెలిపారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో కోదండరాముని చెరువు, చినజగ్గంపేట గ్రామంలో కొత్తచెరువుల్లో పూడికతీత పనులను ఆమె పరిశీలించారు. కూలీల మస్టరును తనిఖీ చేశారు. కూలీల సమస్యలపై వారిని అడిగి తెలుసుకున్నారు.