అత్యాచారం కేసులో సంచలనం తీర్పు

NLG: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు దొమల రాములకు 21ఏళ్ల జైలు శిక్ష, రూ.30వేల జరిమానా విధిస్తూ జడ్జి రోజా రమణి తీర్పు ఇచ్చారు. అదే విధంగా బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. 2018 చిట్యాలలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా వాదనలు విన్న కోర్టు ఇవాళ తుది తీర్పును వెల్లడించింది.