విజయవాడలో ఐదుగురు అరెస్ట్

కృష్ణా: విజయవాడలోని సత్యనారాయణపురంలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ కార్యాలయం తెలిపిన వివరాల మేరకు.. నిందితులు సాల్మన్ రాజు, క్రాంతి చైతన్య, విష్ణువర్ధన్, రేవంత్ కుమార్, మహేష్‌ను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 45 వేల విలువైన 8.7 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.