ట్రంప్ మెడపై మచ్చ.. వైట్‌హౌస్ క్లారిటీ

ట్రంప్ మెడపై మచ్చ.. వైట్‌హౌస్ క్లారిటీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ ఉండడంపై వైట్ హౌస్ వైద్యుడు సీన్ బార్బబెల్లా స్పందించారు. ఆ మచ్చ సాధారణ చర్మవ్యాధి చికిత్స వల్లే ఏర్పడిందని వెల్లడించారు. అది తీవ్రమైన అనారోగ్యం వల్ల వచ్చింది కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ట్రంప్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు. ఎర్రమచ్చకు సంబంధించిన ఫొటో వైరల్ కావడంతో డాక్టర్ క్లారిటీ ఇచ్చారు.