త్రో బాల్ పోటీలకు ఎంపికైన ముత్తిరెడ్డిగూడెం క్రీడాకారులు
BHNG: మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెంకు చెందిన గుర్రాల బన్నీ, ఆలకుంట్ల మనోజ్, మధాను ఆశిష్ జాయ్ అను క్రీడాకారులు జాతీయస్థాయి త్రో బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవలి HYDలోని మాదాపూర్ CGR ఇంటర్నేషనల్ పాఠశాలలో జరిగిన జూనియర్ కేటగిరి అండర్ 19 త్రో బాల్ రాష్ట్ర స్థాయి ఎంపికలో వీరిని జాతీయ స్థాయికి ఎంపిక చేశారు.