అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: SI
కోనసీమ: యువత డ్రగ్స్, మాదకద్రవ్యాల బారినపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని మలికిపురం ఎస్సై సురేష్ కోరారు. లక్కవరం జూనియర్ కళాశాలలో విద్యార్థులకు శుక్రవారం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.