మతోన్మాద BJPని ఓడించాలి: మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో సీపీఎం పోటీ చేస్తుందని, లౌకిక పార్టీలతో కలిసి ముందుకెళ్తామన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహాన్ని అరికట్టాలని అన్నారు.