బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీడీడీ ఈవో సమీక్ష

AP: తిరుమలలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్నమయ్య భవన్‌లో టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమలలోని అన్ని గదులలో విద్యుత్ పనులు, ఇతర రిపేర్లు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. యాత్రికుల వసతి సముదాయాల్లో కూడా సెంట్రలైజ్డ్ బుకింగ్ సిస్టమ్ అప్లికేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.