రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
SKLM: రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ముస్లిం సోదర, సోదరీమణులకు మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంత్రి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. రంజాన్ పండుగ కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాకుండా, అన్ని వర్గాల ప్రజలను కలుపుకు పోయే సోదర భావానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.