గిట్టుబాటు ధర ఏది.. అంత సిండికేట్ మాయ.!
కృష్ణా: ధాన్యం, పత్తి, మొక్కజొన్న, మినుములు, పెసలకు గిట్టుబాటు ధర లేక ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులు అల్లాడుతున్నారు. NTR జిల్లాలో రూ.8,110 పత్తి మద్దతు ధరను మిల్లర్లు రూ. 4-5 వేలకే కొంటున్నారు. ఇప్పటివరకు కేవలం 100 టన్నుల పత్తి మాత్రమే CCA కేంద్రాలు కొన్నాయి. రూ.2,400 మొక్కజొన్న ధర రూ. 1,790కి దిగజారింది. అధికారులు వెంటనే స్పందించి, మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరారు.