'బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయరాదు'

VZM: వేడి చేసి చల్లార్చిన నీటినే ప్రజలు తాగాలని బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి కోరారు. విస్తారంగా వర్షాలు కురవడంతో ఆరోగ్యం కోసం ప్రజలకు పలు సూచనలు చేశారు. వేడి ఆహారాన్ని తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద చెత్త వేయొద్దని పేర్కొన్నారు. ప్రజలంతా తమ వంతు బాధ్యతగా డస్ట్ బిన్లు వాడాలని అన్నారు.