ఎరువుల కొరత లేకుండా చూడాలి: ఏడీఏ

KKD: రైతులకు ఎరువుల కొరత లేకుండా అధికారులు పరస్పరం చర్యలు చేపట్టాలని కాకినాడ ఏడీఏ దుర్గా లక్ష్మీ ఆదేశించారు. పెదపూడి మండలంలో ఎరువుల పరిస్థితిపై మండల వ్యవసాయ అధికారి సత్యప్రసాద్, ఏడీఏ దుర్గా లక్ష్మీ సహకార సొసైటీలో తనిఖీలు నిర్వహించారు. సహకార బ్యాంకు ద్వారా రైతులందరికీ ఎరువుల పంపిణీ పట్ల హర్షం వ్యక్తం చేశారు. సొసైటీ సీఈవో సాయిబాబు పాల్గొన్నారు.