ఆయిల్ పామ్ సాగుకు రైతులకు సూచన
NZB: మంచి లాభాల కోసం సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ సాగుపై రైతులు మొగ్గు చూపాలని ఉద్యాన శాఖ అధికారి రుద్ర వినాయక్ సూచించారు. వెల్గటూర్ రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో ఆయిల్ పామ్ పథకంపై అవగాహన కల్పించారు. సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు అందించడంతో పాటు నాలుగేళ్ల పాటు ఎకరాకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.