VIDEO: శివ నామస్మరణతో మారుమోగిన క్షేత్రం
NDL: పరమశివుడికి ప్రీతికరమైన సోమవారం సందర్భంగా శ్రీశైలం మల్లన్న క్షేత్రం భక్తుల రద్దీతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం వారు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం శివ స్వాముల శివ నామస్మరణతో మార్మోగింది. ఆలయ పూజరులు శివ స్వాములకు మినహా మిగిలిన భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం కల్పించారు.