నేటితో కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు

నేటితో కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు

HYD: నేటితో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి అంబేద్కర్ సచివాలయం, పబ్లిక్ గార్డెన్ ముఖద్వారం, అమరవీరుల స్మృతిచిహ్నాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మువ్వన్నెల కాంతులతో ఈ ప్రాంతం చూపరులను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలను, భవిష్యత్ ప్రణాళికల గురించి తెలియజేయడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.