సామెత-దాని అర్థం

సామెత-దాని అర్థం

సామెత: 'అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు'

అర్థం: ఏదైనా కార్యం తలపెట్టే ముందు సంబంధిత వ్యక్తులతో పర్యవసానాలను  ముక్కుసూటిగా స్పష్టంచేయడం ఉత్తమం. లేదంటే అపార్థాలు, వైరాలు వచ్చిన తర్వాత 'అయ్యో అప్పుడే చెప్పి ఉండాల్సింది' అని బాధపడాల్సి ఉంటుంది. ఇలా సగం వరకు వెళ్లి అయ్యో అనుకునే కన్నా ముందే మాట్లాడుకోవాలని చెప్పే సందర్భంలో ఈ సామెత వాడుతుంటారు.