చదువుతో సమానంగా క్రీడల్లో రాణించాలి: డీఎస్ఓఓ
KRNL: విద్యార్థులు చదువుతో సమానంగా క్రీడల్లో రాణించినప్పుడే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని డీఎస్ఓ ఓ భూపతిరావు, రాష్ట్ర యోగా సంఘం ఛైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి,ఒలింపిక్ సంఘం సీఈవో విజయ్ కుమార్ అన్నారు. శనివారం కర్నూలు స్టేడియంలో జిల్లాస్థాయి షూటింగ్ బాల్ ఎంపిక పోటీలను వారు ప్రారంభించారు. క్రమశిక్షణతో పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయికి అర్హత సాధించాలన్నారు.