పిహెచ్సీకి ఫ్రిజ్ వితరణ చేసిన ఎంపీపీ

పిహెచ్సీకి ఫ్రిజ్ వితరణ చేసిన ఎంపీపీ

విశాఖ: మాకవరపాలెం పిహెచ్సీకి ఎంపీపీ రుత్తల సత్యనారాయణ ఫ్రిజ్ అందజేశారు. ఈ పిహెచ్సీలో ల్యాబ్ విభాగంలో మందులు ఉంచడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీపీ సత్యనారాయణ రూ.20 వేలు విలువ చేసే ఫ్రిజ్‌ను శుక్రవారం వైద్యాధికారి సీతారామలక్ష్మికి ఫ్రిజ్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యూత్ అధ్యక్షుడు పిల్లా శ్రీను, వైస్ ఎంపీపీ రాజారావు పాల్గొన్నారు.